![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏటో వెళ్ళిపోయింది మనసు'. మూవీ రేంజ్ లో హైప్ ని క్రియేట్ చేస్తూ ఈ సీరియల్ గ్రాంఢ్ గా గా మొదలైంది. ఈ సీరియల్ ఎపిసోడ్ -2 లో.. రామలక్ష్మి, సీతాకాంత్ ఇద్దరివి విభిన్న అభిరుచులు గలవారు. రమాకాంత్ కి 90' s లో ఉన్న అలవాట్లు, కట్టుబాట్లు ఉంటాయి. ఇంకా ఫ్యామిలి ఎమోషన్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే ఫార్ములాను నమ్ముతుంటాడు.
రామలక్షి నూతన పోకడలంటే ఇష్టం. తనకన్నా ఎక్కువ ఏజ్ గలవారంటే అసలు నచ్చరు. అప్పట్లో ఒకరితో ఒకరికి సంబంధం ఉండేది. ఇప్పుడు ప్రపంచం మొత్తం మన చేతిలో ఉందని నమ్ముతూ.. ట్రెండ్ కి తగ్గట్టుగా ఉంటూ ట్రెండ్ ని ఫాలో అవుతుంటుది. తనకి ఉన్నంతలో ఇతరులకు సాయం చేసే మనసత్వం. మరొకవైపు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య పెద్ద బిజినెస్ మెన్స్ తో మీటింగ్ లో మాట్లాడుతు.. తన మనవడి గురించి గొప్పగా చెప్తుంటాడు. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. మీటింగ్ మొదలవుతుందని అనుకునేలోపు.. అప్పుడే అతనికి ఫోన్ వస్తుంది. మీటింగ్ వదిలేసి ఇంటికి హడావిడిగా వెళ్తాడు సీతాకాంత్. తీరా చూస్తే అతని చెల్లెలికి కాలు బెనుకుతుంది. దానికే హడావిడి చేస్తు ఇంటికి డాక్టర్స్ ని రప్పించి మరీ ట్రీట్ మెంట్ ఇస్తాడు. అంత పెద్ద మీటింగ్ వదిలి వచ్చావా అని తన చెల్లి అడుగుతుంది. నాకు ఫ్యామిలీ ఫస్ట్, ఆ తర్వాతే బిసినెస్ అని చెప్తాడు ఆ మాట తన తల్లి వింటుంది. తన సొంత కొడుకు కాకున్న సీతాకాంత్ అంటే తనకి చాలా ఇష్టం. సీతాకాంత్ ని పెద్ద కొడుకులాగా చూస్తుంది. తన ఇంకొక కొడుకు కోడలిని పిలవగానే వాళ్ళు భయంతో పరుగెత్తుకొని వస్తారు. తన కోడలు మాత్రం.. సవతి కొడుకుని ప్రేమగా చూసినట్లు సొంత కొడుకుని అలా చూడదని ఫీల్ అవుతూ ఉంటుంది.
ఆ తర్వాత బెస్ట్ బిజినెస్ అవార్డు వచ్చినందుకు సీతాకాంత్ కి తన తల్లి డైమండ్ రింగ్ గిఫ్ట్ గా ఇస్తుంది. అది చూసి చిన్న కొడుకు, కోడలు ఈర్షపడతారు. నాకు చిన్న చాక్లెట్ ఇచ్చిన అమ్మ.. ప్రేమతో ఇస్తే నాకు అదే గొప్పదని సీతాకాంత్ చెప్తాడు. ఆ తర్వాత తిరిగి మీటింగ్ కి వెళ్తాడు. అక్కడ ఎందుకు వెళ్ళాలిసి వచ్చిందో చెప్తాడు. మీటింగ్ లో మాట్లాడుతు.. నేను ఈ పొజిషన్ లో ఉన్నానంటే కారణం ఒకరు.. అతను నా ఫ్రెండ్ కాదు ఫ్యామిలీ కాదు.. బట్ నా లైఫ్ చేంజర్ అని, అతని ఫోటో ఫ్రేమ్ కట్టించుకొని రోజు అతని ఫోటో చూస్తానని సీతాకాంత్ చెప్తాడు. మరొకవైపు అది నేనే.. అన్నింటికి కారణం నేనే అని రామలక్ష్మి నాన్న అనుకుంటు ఉంటాడు. అసలు సీతాకాంత్ , రామలక్ష్మి వాళ్ళ నాన్నకి మధ్య గల సంబంధమేంటో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |